హనంకొండ జిల్లా కేంద్రంలో ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా AJ పెడల్స్ వారు సెప్టెంబర్ 17 నుండి 21 వరకు సైక్లింగ్ మరియు వాకింగ్ ఛాలెంజ్ నిర్వహించారు. గుండె ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం కలిగించడం, శారీరక వ్యాయామాన్ని దినచర్యలో భాగంగా చేసుకోవాలని నిర్వాహకులు నిఖిల్, ఆర్గనైజర్ జయంత్ అన్నారు. ఏడు రోజుల సైకిల్ ఛాలెంజ్ పూర్తి చేసిన వారిని కానిస్టేబుల్ జయరాజ్, సంపత్, రమేష్, కృష్ణ, నాగరాజు, సోమశేఖర్ మంగళవారం అభినందించి మెడల్స్ అందజేశారు. శారీరక వ్యాయామం కోసం ప్రతిరోజూ సైక్లింగ్ చేయాలని సూచించారు.