మేడారం జాతరకు అధికారికంగా సెలవుదినం ప్రకటించాలి
మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అధికారికంగా సెలవుదినం ప్రకటించకపోవడం విడ్డూరమని వరంగల్ నగరంలో VHP రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ బాలస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లకోసారి నిర్వహించే ఈ మహా గిరిజన జాతర తెలంగాణ రాష్ట్రానికి తలమానికమని, దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరయ్యే ఈ వేడుకకు తగిన గుర్తింపు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు.
