ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


అక్రమ మైనింగ్‌పై సీఐడీ విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Mar 28, 2026, 11:03 IST/

అక్రమ మైనింగ్‌పై సీఐడీ విచారణకు సీఎం రేవంత్ ఆదేశం

Mar 28, 2026, 11:03 IST
తెలంగాణలో అక్రమ మైనింగ్‌పై సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ తో పాటు, గంగుల, వద్దిరాజు మైనింగ్‌పై కూడా విచారణ జరుగుతుందని తెలిపారు. సిరిసిల్ల ఇసుక మాఫియాపై కూడా విచారణ చేయిస్తామని, జూన్ 2 నుంచి ఇప్పటివరకు ఇచ్చిన మైనింగ్ లీజులపై విచారణ జరిపి, వచ్చే అసెంబ్లీలో నివేదికలు సమర్పిస్తామని సీఎం వెల్లడించారు. అక్రమ మైనింగ్‌కు హరీష్, కేటీఆర్ నాయకత్వం వహించారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల బ్లాక్‌మెయిల్స్‌కు భయపడేది లేదని, సీఐడీ విచారణతో నిజాలు నిగ్గుతేలుతాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.