తెలంగాణ మైనారిటీ పాఠశాలలో వైద్య పరీక్షలు

2చూసినవారు
తెలంగాణ మైనారిటీ పాఠశాలలో వైద్య పరీక్షలు
హన్మకొండ జిల్లా ఆర్ బి ఎస్ కే వైద్య బృందం తెలంగాణ మైనారిటీ పాఠశాల యందు పిల్లలందరికీ వైద్య పరీక్షలు జరిపి ఆరోగ్య సమస్యలు ఉన్న పిల్లలని గుర్తించి పై చికిత్సల నిమిత్తం ఎంజీఎం DEIC కి రిఫర్ చేయడం జరిగింది. డాక్టర్ బి దుర్గాప్రసాద్ పిల్లలందరికీ ఆరోగ్య సూత్రాలు పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ టీ కవిత, ఫార్మసీ ఆఫీసర్ దినేష్ ఏఎన్ఎం శారద, హెల్త్ సూపర్వైజర్ రాజేష్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్