జనగణన హౌజ్ బ్లాక్ లిస్టింగ్ పై సమావేశం

4చూసినవారు
హన్మకొండ జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్‌చార్జ్ కమిషనర్, కలెక్టరేట్లో జనగణన హౌస్ బ్లాక్ లిస్టింగ్ పై అధికారులతో సమావేశమయ్యారు. టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు కీలక సూచనలు చేశారు. జిడబ్లుఎంసి లోని 67 రెవెన్యూ వార్డుల్లోని గృహ సముదాయాలను పూర్తిగా కవర్ చేస్తూ సమగ్ర మ్యాపింగ్ చేపట్టాలని, ఏ ఇల్లు కూడా మిస్ కాకుండా చూడాలని ఆదేశించారు. ప్రతి వార్డుకు సంబంధించిన రెవెన్యూ సిబ్బంది, ఆర్‌వోలు, ఆర్‌ఐలు, బిల్ కలెక్టర్లు, వార్డ్ ఆఫీసర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :