హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో రెండవ రోజు రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమీషన్ చైర్మన్ కోదండ రెడ్డి, తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పోరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, టిజిఏఎఫ్ డబ్లూసి మెంబర్ రాంరెడ్డి గోపాల్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సీడ్ కార్పోరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, సంబంధిత జిల్లా అధికారులు, రైతులు కూడా హాజరయ్యారు.