మళ్ళీ నోరుజారిన మంత్రి కొండా.. ఫైర్ అయిన గంట

4చూసినవారు
శ్రీరాముడిని పూజిస్తే పైసలు రాలుతాయా అని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటం సిగ్గుచేటని వరంగల్‌ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సురేఖ వెంటనే హిందూ సమాజానికి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పి, తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేదంటే ఆమెను అడ్డుకుంటామని గంట రవికుమార్‌ హెచ్చరించారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి హిందూ దేవుళ్లను అవమానించడం, విషం చిమ్మడం సరికాదని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్