మంత్రి కొండ సురేఖని వెంటనే పదవి నుంచి తొలగించాలి

3చూసినవారు
మంత్రి కొండ సురేఖ "జై శ్రీరామ్ అంటే డబ్బులు పడతాయా?" అని చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు తీవ్రంగా ఖండించారు. తిరుపతితో సహా అనేక దేవాలయాలకు వెళ్లేటప్పుడు డబ్బులు ఇస్తేనే వెళ్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. దేవదాయ శాఖ మంత్రిగా ఉండి, హిందూ దేవతలపై, విశ్వాసాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రదీప్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్