బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు వరంగల్ ఓ సిటీలో మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కేవలం హనుమకొండ నియోజకవర్గానికి పరిమితం కావడం ప్రజల దురదృష్టమని ఆరోపించారు. మంత్రి సురేఖ అసమర్థత వల్లే సీఎం వరంగల్ నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాలను పర్యటించలేదని, మంత్రి తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.