భద్రకాళి బండ్ చేంజ్ ప్రారంభించిన మంత్రులు

3చూసినవారు
గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ (జీ డబ్ల్యూ ఎస్ సి సి ఎల్) ఆధ్వర్యంలో, బల్దియా పరిధిలోని 29వ డివిజన్ భద్రకాళి బండ్ (పోతన రోడ్డు వైపు) వద్ద రూ. 84.20 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, నగర మేయర్ గుండు సుధారాణి, స్థానిక ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కే ఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్/బల్దియా ఇంచార్జి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్