హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి దుర్గా రామ్ కుమార్, సీనియర్ మెడికల్ అధికారి డాక్టర్ మహేందర్, మాస్ మీడియా అధికారి సుభాష్, ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి వైద్యాధికారి విజయలక్ష్మి, స్టేట్ రెడ్ క్రాస్ మెంబర్ ఈ. వి. శ్రీనివాస్, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.