వరంగల్: రాంపూర్ మున్సిపల్ డంపింగ్ యార్డ్ సమీపంలో నూతనంగా బయో మైనింగ్ ప్రాజెక్టును మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అధికారులతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు. మడికొండ డంపింగ్ యార్డు అంశంపై తాను అసెంబ్లీలో ప్రసంగించానని, హైదరాబాద్ నగరం నుండి వరంగల్ కు వస్తుంటే ముఖద్వారం మడికొండ అని, బయో మైనింగ్ మిషన్ల ద్వారా చెత్త నియంత్రణ సాధ్యమవుతుందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఈ ప్రాజెక్టుతో చెత్త నిర్వహణలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.