టీపీసీసీ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని

4చూసినవారు
హైదరాబాదులోని గాంధీ భవన్ లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జెండా మోసిన స్థాయి నుంచి ఎందరో నాయకులు చేపట్టిన డీసీసీ పదవిని 11 ఏళ్లు నిర్విరామంగా పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ సమావేశం టీపీసీసీ కార్యనిర్వాహక కమిటీ సభ్యుల సమక్షంలో జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్