వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్,
బీజేపీ నేత నీతిన్ నబిన్‌లపై తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయంపై ఆయన పలు ప్రశ్నలు సంధించారు.
బీజేపీ హయాంలో వరంగల్ ఎయిర్‌పోర్టుకు అనుమతులు రాలేదని,
కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 300 కోట్లతో భూసేకరణ చేసిందని ఆయన తెలిపారు. తెలంగాణ కట్టే పన్నులకు తగిన నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. స్మార్ట్ సిటీ నిధుల వినియోగంలో
బీజేపీ, బీఆర్ఎస్ విఫలమయ్యాయని, దేవుడి పేరిట
రాజకీయం చేయడం తప్ప రాష్ట్రానికి తెచ్చిన ప్రాజెక్ట్ ఏదో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు.