సినీ నటులు మోహన్ బాబు, విష్ణులను వెంటనే అరెస్ట్ చేయాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ డిమాండ్ చేశారు. బుధవారం కాకతీయ యూనివర్సిటీ వద్ద మోహన్ బాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో పేద విద్యార్థుల నుండి భారీగా డబ్బులు వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేసి, విచారణ కమిటీ వేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.