వరంగల్ పోలీసు కమిషనర్ గా తొలిసారిగా మహిళా అధికారిణి ఎన్. శ్వేతను ప్రభుత్వం సోమవారం రాత్రి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న సీపీ సన్ ప్రీత్ సింగ్ ను సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా బదిలీ చేశారు. హైదరాబాద్ నార్త్ జోన్ జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న ఎన్. శ్వేతను వరంగల్ సీపీగా నియమించారు. 2012 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన శ్వేత, మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కేడర్ కు వెళ్లి, తూర్పు గోదావరి జిల్లా చింతూర్ లో ఏఎస్పీగా పనిచేశారు. అనంతరం తెలంగాణకు బదిలీ అయ్యారు.