వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఎన్. శ్వేత బాధ్యతల స్వీకరణ

2086చూసినవారు
వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఎన్. శ్వేత బాధ్యతల స్వీకరణ
వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఎన్. శ్వేత బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సాయుధ పోలీసులు ఆమెకు గౌరవ వందనం సమర్పించగా, మాజీ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ఎన్. శ్వేత తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేసేలా సమర్థవంతమైన పోలీసింగ్‌ను అమలు చేస్తామని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్