కలెక్టరేట్లో ఉద్యోగుల సమక్షంలో నూతన సంవత్సర సంబరాలు

3చూసినవారు
నూతన సంవత్సరంలో హనుమకొండ జిల్లాను అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, టీజీవో, టీఎన్జీవోస్, రెవెన్యూ, ఇతర సంఘాల ఆధ్వర్యంలో నూతన సంవత్సర సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు తోడ్పాటు అందించే విధంగా నోట్ బుక్స్, బ్లాంకెట్స్, పెన్నులను అందజేశారు.

ట్యాగ్స్ :