వరంగల్ నగరంలోని పెట్రోల్ బంకుల్లో యూపీఐ చెల్లింపులు నిలిపివేసి, నగదు చెల్లింపులకే ప్రాధాన్
యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. రద్దీని తగ్గించేందుకు ఈ వినూత్న పద్ధతిని పెట్రోల్ బంక్ యాజమాన్యం అనుసరిస్తున్నట్లు సమాచారం. నగదు లేక కొందరు వాహనదారులు వెనుదిరుగుతుండగా, మరికొందరు నగదు తెచ్చుకోవడానికి వెళ్తున్నారు. అయితే, పెట్రోల్ బంకుల ఆవరణలో నగదు చెల్లింపుల కోసం కొందరు కమీషన్ వసూలు చేస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు.