హనుమకొండ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో శనివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. లయన్ డా. పెరుమాండ్ల రామకృష్ణ ట్రస్ట్ చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ, విద్య పేదల పిల్లలకు సమాజం ఇచ్చే అతి పెద్ద ఆయుధమని, విద్యార్థి చేతిలో పుస్తకం పెట్టడం అంటే భవిష్యత్తుకు బాటలు వేయడమేనని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న
విద్యార్థులు ఇబ్బందుల మధ్య విద్యనభ్యసిస్తున్నారని, అలాంటి వారికి అండగా నిలవడం సామాజిక సంస్థల బాధ్యత అని తెలిపారు.