హన్మకొండ జిల్లా మడికొండ అంబేద్కర్ నగర్ శ్రీ దుర్గ శక్తి అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న దుర్గామాత నవరాత్రుల ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మెట్టు రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, రశీదు బుక్‌ను బుధవారం ప్రారంభించారు. నవరాత్రుల వేడుకలను అత్యంత వైభవంగా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్లపు మధు, గట్టుపల్లి ఎనోష్, రామ్ లక్ష్మణ్ రాకేష్, రాజు తదితరులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.