అమ్మవారికి లక్ష గులాబి పూలతో అర్చన

1చూసినవారు
వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న వసంత నవరాత్రి మహోత్సవాలు తొమ్మిది రోజులకు చేరుకున్నాయి. ఉగాది నుండి శ్రీ రామ నవమి వరకు జరిగిన ఈ మహోత్సవాలు నేటితో ముగిశాయి. ఈ సందర్భంగా అమ్మవారికి లక్ష గులాబీ పూలతో అర్చన నిర్వహించారు. వసంత నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారికి వివిధ పూలతో అర్చిస్తే అంతా శుభం కలుగుతుందని దేవాలయ అర్చకులు నాగరాజు శర్మ తెలిపారు. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల పూలతో ప్రతిరోజూ లక్ష పుష్పార్చన నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్