మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. కౌన్సిల్ హాల్ వద్ద పోలీసుల అత్యుత్సాహంపై ఎమ్మెల్సీ సారయ్య మండిపడ్డారు. నక్సల్స్ ఉన్నప్పుడు కూడా ఇంత బందోబస్తు లేదని, ఇప్పుడు ఎందుకు ఇంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.