మడికొండ మండలం అమ్మవారి పేటలో సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా, సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, సమ్మక్క గద్దెకు చేరుకోవడానికి ముందు AK47తో గాలిలో కాల్పులు జరిపి అమ్మవారికి స్వాగతం పలికారు. అమ్మవారు గద్దెకు చేరుకున్నాక భక్తులు సమ్మక్క-సారలమ్మలకు మొక్కులు చెల్లించి, దర్శించుకుంటున్నారు. ఈ సంఘటన జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.