వరంగల్ (వెస్ట్) లో సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్, రేపు ఆదివారం జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 0 నుండి 5 సంవత్సరాల మధ్య వయస్సు పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రయాణంలో ఉన్నవారి కోసం బస్, రైల్వే స్టేషన్లలో కూడా పోలియో బూత్‌లు ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.