ప్రముఖ గాయకుడు భాస్కర్ గుండెపోటుతో మృతి

0చూసినవారు
ప్రముఖ గాయకుడు భాస్కర్ గుండెపోటుతో మృతి
ప్రముఖ గాయకుడు పోలెపల్లి భాస్కర్ గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల అభిమానులు, ఆత్మీయులు, బంధుమిత్రులు, కళాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాల్యం నుంచే సంగీతంపై మక్కువతో ఎదిగిన భాస్కర్, వరంగల్ బాల సుబ్రహ్మణ్యంగా పేరుగాంచారు. ఆయన అనేక ఆర్కెస్ట్రా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నివాళులర్పించిన వారిలో వరంగల్ ఘంటసాల గాయకులు గుజ్జారి రమేశ్, ఆర్కెస్ట్రా వాయిద్యకారులు కొండా రంగనాథ్, ఇతర గాయకులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్