హనుమకొండ జిల్లా ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి అభివృద్ధి కమీటీ సమీక్ష సమావేశానికి మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి లతో కలసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. సమీక్ష సమావేశానికి ముందు వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య ఆసుపత్రిలోని పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు.