పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే పుకార్లతో హనుమకొం
డ, వరంగల్ నగరాల్లోని పెట్రోల్ బంకుల వద్ద వినియోగదారులు భారీగా తరలివచ్చారు. దీంతో బంకుల్లో నిల్వలు అడుగంటాయి. 'నో స్టాక్' బోర్డులు పెట్టడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల మేర క్యూలో నిల్చున్నప్పటికీ, చివరి నిమిషంలో స్టాక్ లేదని చెప్పడంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.