నితిన్ నబీన్ పర్యటనలో నిరసనలు, పోలీసులపై బండి సంజయ్ ఆగ్రహం

0చూసినవారు
హనుమకొండలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కాళోజీ జంక్షన్ వద్ద కాంగ్రెస్ నేత సతీష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపారు. 'నితిన్ నబీన్ గో బ్యాక్', 'ఛాత్రోం కి గూంజ్' వంటి ఫ్లెక్సీలతో ప్రధాని మోడీ, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వరంగల్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌ఎస్‌యూఐ నాయకులు పదే పదే అడ్డుకుంటున్నా పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. ముందస్తు సమాచారం ఇచ్చినా పోలీసులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్