భూతగాదాల కేసుల్లో మధ్యవర్తిత్వం వహిస్తూ సెటిల్‌మెంట్లకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ స్టేషన్ అధికారులను ఆదేశించారు. కెయూసి పోలీస్ స్టేషన్ సందర్శించిన ఆయన, స్టేషన్ పరిసరాలు, స్టోర్, కేసు ప్రాపర్టీ గదులు, స్వాధీనం చేసుకున్న వాహనాలను పరిశీలించారు. సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత, ఏసిపి నర్సింహరావు, సీఐ రవికుమార్ ఆయనకు స్వాగతం పలికారు.