వరంగల్ కాకతీయ యూనివర్సిటీలోని సమ్మక్క-సారక్క హాస్టల్లో 14 మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి. దీంతో విద్యార్థులు యూనివర్సిటీ హెల్త్ సెంటర్కు వెళ్లగా మందులు లేవని చెప్పడంతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఎలుకల బెడద నుంచి తమను కాపాడాలని పలుమార్లు యూనివర్సిటీ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా వెంటనే చర్యలు చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షల కంటే ఎలుకల భయమే ఎక్కువగా పట్టుకుంది.