హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ పథకాల అమలు, పురోగతిని ఆయన సమీక్షించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, రైతులకు ఇబ్బందులు లేకుండా జరగాలని, వేసవిలో తాగునీటి సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. మండల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.