వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, సమస్యలున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. 31, 51 డివిజన్లలో రూ. 1.60 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్ట్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఎన్నికల ముందు పాదయాత్రలో గుర్తించిన సమస్యలను ప్రాధాన్యత ప్రకారం దశలవారీగా పరిష్కరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.