హన్మకొండలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయాలకు (ఐడీఓసీ) సంబంధించిన రూ. 85,61,262 పన్ను బకాయిలను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సోమవారం హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులకు చెక్ రూపంలో అందజేశారు. నగర పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు తమ పన్ను బకాయిలను వెంటనే చెల్లించి బల్దియాకు సహకరించాలని కలెక్టర్ సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఒక రోజు మాత్రమే మిగిలి ఉన్నందున, 31 అర్ధరాత్రి వరకు సేవ కేంద్రాలు తెరిచి ఉంటాయని తెలిపారు.