ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, రైతుల ఇబ్బందులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఒక ఆర్టీసీ డ్రైవర్‌ను ఉద్యోగం నుంచి తొలగించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మాజీ చీఫ్ విప్, దాస్యం వినయ్ భాస్కర్ హనుమకొండలో తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో సమస్యలపై ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అలాంటి వారిపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగడం సరికాదని ఆయన మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజల, రైతుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, వాటిని ఎత్తిచూపిన వారిపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అన్నదాతల కష్టాలను చూసి చలించి మాట్లాడిన ఆర్టీసీ డ్రైవర్‌కు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.