తెలంగాణ అభివృద్ధి, ప్రత్యేక రాష్ట్ర కల సాకారంలో
బీజేపీ పాత్ర కీలకమని ఆ పార్టీ జాతీయ నేత నితిన్ నబీన్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఎయిమ్స్ మంజూరు చేసి, వేగంగా నిర్మించిన ఘనత కేంద్రానిదేనని గుర్తుచేశారు. రాబోయే వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో
బీజేపీ ఘన విజయం సాధించాలని, వరంగల్ ఖిల్లాపై కాషాయ జెండా ఎగరాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వరంగల్‌తో పాటు తెలంగాణ అంతటా కమలం జెండా ఎగిరినప్పుడే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన దిశానిర్దేశం చేశారు.