సార్ల రాజుకు డీఎస్పీగా పదోన్నతి

3చూసినవారు
సార్ల రాజుకు డీఎస్పీగా పదోన్నతి
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గూడూరు మండల పరిధిలో గల కొత్తగూడ పోలీస్ స్టేషన్‌లో ప్రొఫెషనరీ ఎస్సైగా 2003లో చేరిన సార్ల రాజు, 2004 జూలై 12న పూర్తిస్థాయి ఎస్సైగా బాధ్యతలు స్వీకరించి 2006 వరకు పనిచేశారు. కొత్తగూడ నుండి బదిలీ అయిన మూడేళ్లకే సీఐగా పదోన్నతి పొందిన ఆయన, పోలీస్ శాఖలో ప్రతిభ కనబరిచి తాజాగా 2026 ఏప్రిల్ 29న డీఎస్పీగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం వరంగల్ టాస్క్ఫోర్స్ సీఐగా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారని తోటి ఉద్యోగులు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్