ధర్మసాగర్ మండలం రాయగూడెం గ్రామంలో నూతన సర్పంచ్ కలకొల్ల మహేష్, అతని సోదరులు కలిసి కొక్కెర నవీన్, మాటూరి శ్రీధర్, శ్రీనాథ్ అనే యువకులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గురువారం నూతన సంవత్సర వేడుకల్లో సర్పంచ్‌కు, నవీన్‌కు మధ్య జరిగిన మాటల వివాదం దీనికి కారణమని తెలుస్తోంది. ప్రాణహాని ఉందని నవీన్ డయల్ 100కు కాల్ చేయడంతో ఆగ్రహించిన సర్పంచ్, తనపై పోలీసులకు సమాచారం ఇచ్చావా అని యువకుల ఇంటిపైకి వెళ్లి దాడి చేశాడని బాధితులు తెలిపారు.