పులిగిల్ల ప్రాథమికోన్నత పాఠశాలలోసావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు

పరకాలలోని పులిగిల్ల ప్రాథమికోన్నత పాఠశాలలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంపత్ రెడ్డి మాట్లాడుతూ మహిళా విద్యాభివృద్ధికి సావిత్రిబాయి చేసిన సేవలను కొనియాడారు. విద్యారంగంలో అంకితభావంతో సేవలందిస్తున్న ఉమా, పద్మ, నిరోష అనే మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. సీనియర్ ఉపాధ్యాయులు సతీష్ మాట్లాడుతూ విద్యార్థుల విద్యా, నైతిక విలువల అభివృద్ధికి వారి నిరంతర కృషికి ఈ సన్మానం గుర్తింపు అని తెలిపారు.
