అమ్మవారి సన్నిధిలో సర్వీస్ కమిషన్ చైర్మన్

1308చూసినవారు
వరంగల్ మహానగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళీ దేవస్థానాన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘనస్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి శేషవస్త్రములు, ప్రసాదములు అందజేశారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్