హనుమకొండ చిల్డ్రన్స్ పార్క్ వద్ద రెక్కీ నిర్వహించిన షీ టీమ్ బృందం ముగ్గురు ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. భౌతికంగా లేదా సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ సుజాత హెచ్చరించారు. పట్టుబడిన యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మహిళల భద్రతే లక్ష్యంగా షీ టీమ్ పనిచేస్తుందని, వేధింపులు ఎదురైతే భయపడకుండా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆకతాయిల బెడదపై 8712685257, 8712685142, 8712685270 నంబర్లకు సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.