హనుమకొండ కిషన్ పురలోని షైన్ ఉన్నత పాఠశాల
విద్యార్థులు శనివారం ఆకాశవాణి కేంద్రంలో 'చిన్నారి లోకం' కార్యక్రమంలో పాల్గొని పాటలు, నాటిక, పద్యాలు, స్కిట్, ప్రసంగం, కథ, జీకే, సూక్తులు వంటి అంశాల్లో ప్రతిభ కనబరిచారు. విద్యార్థుల్లో పఠన నైపుణ్యాలు, స్టేజ్ ఫియర్ పోగొట్టడానికి ఈ కార్యక్రమాలు దోహదపడతాయని పాఠశాల చైర్మన్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 4వ తేదీ ఆదివారం ఉదయం 9:30 గంటలకు ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా ప్రసారం కానుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.