హనుమకొండ జిల్లా
కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలను ఖండించారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కుడా భూములపై చేస్తున్న వ్యాఖ్యలు అవాస్తవమని, దమ్ముంటే గజం రూ.75 వేల చొప్పున ఆ భూములను కొనుగోలు చేయాలని సవాల్ విసిరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుడాకు 225 ఎకరాల భూములను కేటాయించి, సంస్థకు రూ.500 కోట్ల ఆదాయ వనరులు కల్పించామని తెలిపారు.