
దేశీయ విపణిలోకి టెస్లా ‘మోడల్ వై ప్రీమియం’
అమెరికా విద్యుత్ కార్ల దిగ్గజం టెస్లా, సరికొత్త 2026 మోడల్ వై ప్రీమియం రేర్ వీల్ డ్రైవ్ కారును భారతీయ విపణిలోకి విడుదల చేసింది. ఈ కారు ధర రూ.50.89 లక్షలు, ఇది దేశీయంగా టెస్లా విక్రయిస్తున్న కార్లలో అత్యంత తక్కువ ధర కలిగిన మోడల్. ఒక్కసారి ఛార్జింగ్‌తో గరిష్ఠంగా 500 కి.మీ ప్రయాణించగల ఈ కారు, కేవలం 5.9 సెకన్లలోనే గంటకు 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుందని సంస్థ తెలిపింది.




