స్కానింగ్ సెంటర్ల దోపిడీపై కఠినచర్యలు తీసుకోవాలి

3చూసినవారు
తెలంగాణ రాష్ట్ర ప్రజా ఆరోగ్య పరిరక్షణ సమితి అధ్యక్షుడు బోట్ల మహర్షి, హనుమకొండ జిల్లాలోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ, అర్హతలేని ఓటీ అసిస్టెంట్లతో అపెండిసైటిస్, గర్భసంచి ఆపరేషన్లు చేస్తున్నాయని ఆరోపించారు. స్కానింగ్ సెంటర్ల దోపిడీపై తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లావ్యాప్తంగా కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు చట్ట నిబంధనలను బేఖాతరు చేస్తూ అఘాయిత్యాలకు పాల్పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్