విద్యను వ్యాపారంగా మార్చితే కఠిన చర్యలు తప్పవు

5చూసినవారు
తల్లిదండ్రులను దోపిడీ చేసే ప్రైవేట్ పాఠశాలలను ఉపేక్షించబోమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యాసంస్థలపై జిల్లా విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా కాస్మోటిక్ ఛార్జీలు, పుస్తకాలు, యూనిఫాంల పేరుతో అధిక మొత్తాలు వసూలు చేసే సంస్థలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. హనుమకొండ పరిధిలోని ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్