నిట్లో ఘర్షణ పడిన విద్యార్థులు... పలువురికి గాయాలు

1చూసినవారు
వరంగల్ NIT క్యాంపస్‌లోని స్ప్రింగ్స్టీ-26 హాస్టల్‌లో జూనియర్స్, సీనియర్స్ విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఫస్టియర్, సెకండియర్కు చెందిన సుమారు 12 మంది విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకున్నారు. దాడుల్లో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యం హెచ్చరించింది.

ట్యాగ్స్ :