రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల జరిగిన పంట, ఆస్తి, ప్రాణ నష్టాలపై క్షేత్రస్థాయిలో అధికారులతో జిల్లాల కలెక్టర్లు సమీక్ష నిర్వహించి, నివేదికలను ప్రభుత్వానికి త్వరగా అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.