వరంగల్ పోలీసులకు సన్ ప్రీత్ సింగ్ కృతజ్ఞతలు

63చూసినవారు
వరంగల్ పోలీసులకు సన్ ప్రీత్ సింగ్ కృతజ్ఞతలు
వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బదిలీపై వెళ్లిన సన్ ప్రీత్ సింగ్‌కు ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాన్ని తాళ్లతో లాగుతూ తమ అభిమానాన్ని చాటారు. ఈ సందర్భంగా సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో 15 నెలల సేవాకాలంలో అధికారులు, సిబ్బంది అందించిన సహకారం మరువలేనిదని, వరంగల్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్