దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ప్రజా ఆకాంక్షలు నెరవేరని నేపథ్యంలో, జూన్ 14న (నేడు) 'తెలంగాణ సర్వజన డెమొక్రటిక్ ఫోరం' ఆధ్వర్యంలో వరంగల్ ప్రెస్ క్లబ్‌లో ప్రాథమిక చర్చా వేదిక జరగనుంది. వనరుల పరాయికరణ, పేదరికం, నిరుద్యోగం, అవినీతి, పౌర హక్కుల పరిరక్షణ ప్రధాన అజెండాగా ఈ సదస్సు సాగనుంది. మహిళా సాధికారత, పారదర్శక పాలన, సామాజిక న్యాయమే లక్ష్యంగా ప్రత్యామ్నాయ నైతిక రాజకీయ వేదిక ఆవశ్యకతపై చర్చించనున్నారు. ప్రస్తుత పార్టీలకు అతీతంగా మేధావులు, సామాజిక శక్తులు, యువత, మహిళలు పాల్గొని భవిష్యత్ కార్యాచరణను రూపొందించాలని ఫోరం పిలుపునిచ్చింది.